* నామినేషన్ల స్వీకరణ కేంద్రం పరిశీలన
ఆకేరు న్యూస్, హనుమకొండ : ధర్మసాగర్ క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను కలెక్టర్ పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ధర్మసాగర్, రాపాకపల్లి గ్రామాలకు సంబంధించి సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లను స్వీకరిస్తున్న కౌంటర్లను కలెక్టర్ పరిశీలించి ఇప్పటివరకు ఎన్ని నామినేషన్లు వచ్చాయని, నిన్న ఆదివారం రోజున సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్లు వచ్చాయని రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎలక్షన్ నోటీసు, ఎలక్టోరల్, రిజర్వేషన్ల జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయంలో పెట్టారా అని ఎంపీడీవో అనిల్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అతికించిన ఎలక్షన్ నోటీసు, ఎలక్టోరల్ రోల్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవో అనిల్ కుమార్ లతో కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు స్థానాలకు వచ్చిన నామినేషన్లకు విడివిడిగా ఫైళ్ళను పెట్టాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పెట్టిన ఎలక్షన్ నోటీసు, ఎలక్టోరల్ జాబితాను పెట్టారా లేదా అని ఎంపీడీవో పర్యవేక్షించాలన్నారు. హెల్ప్ డెస్కుల ద్వారా నామినేషన్ వేసే అభ్యర్థులకు కావాల్సిన సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, స్థానిక తహసిల్దార్ సదానందం, ఎంపీవో సయ్యద్ అఫ్జల్ , రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
…………………………………………………..
