
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. గ్రంథాలయ సిబ్బందితో మాట్లాడి పాఠకుల సంఖ్య పెంచి వారికి కావలసిన పుస్తకాలను అందించాలని సూచించారు. గ్రంథాలయం ఆవరణలో పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గద్దల నవీన్,లక్కీ,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సర్వ అక్షిత్,ములుగు మార్కెట్ కమిటీ మెంబెర్ పెద్ది రాజ్ కుమార్,మార్కెట్ కమిటీ మెంబెర్ దేవ్ సింగ్,యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు కర్ల తరుణ్,నగవత్ కిరణ్,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………………..