
* జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి, ఎం. శ్రీనివాస్ రావు
ఆకేరు న్యూస్, ములుగు: రాష్ట్ర వ్యాప్తంగా 2025 ఆగష్టు 22 తేదీన “పనుల జాతర” కార్యక్రమాన్ని పురస్కరించుకొని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుందని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి, ఎం. శ్రీనివాస్ రావు గురువారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయితీలలో ఇప్పటికే పూర్తయిన పనులను ప్రారంభించడం తో పాటు, కొత్త పనులకు భూమి పూజలు చేయబడతాయాన్నారు.
దీనిని పురస్కరించుకొని చేపట్టబోయే ప్రధాన పథకాలు:
1. ఉపాధి హామీ పథకం (MGNREGS) పనులు.
2. పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ పనులు.
3. స్వచ్ఛ భారత్ మిషన్ (SBM) పనుల తో పాటు గ్రామాలలో
కమ్యూనిటీ శౌచాలయ సముదాయములు, పశువుల కొట్టాలు, కొల్లషెడ్లు, మేకల షెడ్లు, వ్యవసాయ బావులు, చెక్ డ్యాములు, తోటలు, ఉద్యానవనాలు, నాడేప్ కంపోస్టు గుంతలు, అజోల్ల నిర్మాణం, పాఠశాల మరుగుదొడ్లు, భవన పైకప్పు వర్షపు నీరు నిల్వ నిర్మాణాలు, ఈత, తాటి చెట్ల నాటడం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులు చేపట్టనున్నమని వివరించారు. దీనితోపాటు
పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ భవనాలు, అంగన్ వాడీ భవనాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహాణ షేడ్లు, సి.సి. రోడ్లు, కమ్యూనిటీ నీరు నిల్వ నిర్మాణాలు ఉంటాయని తెలిపారు. జిల్లా పరిపాలనా లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనుల ప్రణాళిక ఖారారు చేసింది. ఈ ప్రణాళికలో మొత్తం 816 పనులకు రూ.33.42 కోట్లు రూపాయలు వ్యయం కేటాయించబడిందని ఆయన తెలిపారు.
……………………………………………..