
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(DK ARUNA)కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FOOD CARPORATION OF INDIA) తెలంగాణ రాష్ట్ర కన్సులేటివ్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించింది. ఈమేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ లో ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూ షన్ సిస్టంలో డీకే అరుణ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ అవకాశం కల్పించినందుకు కేంద్రానికి డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు. రైతులు, పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని, కేంద్రం తనపై పెట్టిన బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తానని అన్నారు. తెలంగాణలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి పాటుపడతానని చెప్పారు.
…………………………………………………….