* ఒక్క డీపీఆర్ అయినా సక్కగా పంపారా?
* మీరు పాలమూరు పచ్చగా మర్చారా..
* కేసీఆర్పై డీకే అరుణ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాలమూరు జిల్లాకు ద్రోహం చేసింది కేసీఆరే అని బీజేపీ ఎంపీ డీకే అరుణ (Dk Aruna) విమర్శించారు. పాలమూరును పచ్చగా మార్చానన్న ఆయన మాటలు పూర్తిగా అబద్ధం అన్నారు. సెంటిమెంట్, రాజకీయం కోసమే పాలమూరును వాడుకున్నారని, ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడింది లేదని ఆరోపించారు. ఆర్డీఎస్ కోసం కేసీఆర్ (Kcr) కంటే తానే ఎక్కువ ఉద్యమించానని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కేసీఆర్ పదేళ్లు కాలయాపన చేశారన్నారు. అభివృద్దికి బీజేపీ (Bjp) అడ్డుపడుతోందని ఇప్పుడు అంటుండడం హ్యాస్యాస్పదమన్నారు. పదేళ్లలో ఎందుకు పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. కేంద్రం డీపీఆర్ ను వెనక్కి పంపిందని ఆరోపణలు చేస్తున్నారని, ఒక్క డీపీఆర్ అయినా కేంద్రానికి సక్కగా పంపారా అని ప్రశ్నించారు.
………………………………………………

