
* పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తుంటే కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఢిల్లీలో నిద్రపోతు న్నాడని , మరో వైపు బండి సంజయ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ మహేశ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాసారని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ ఎస్ లోపాయకారీ ఒప్పందంతోనే యూరియాను అడ్డుకుంటూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తక్షణమే తెలంగాణకు రావాల్సిన యూరియా వాటాను కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత వారిదేనన్నారు. కాంగ్రెస్ మీద అక్కసుతోనే రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇవ్వట్లేదని ఆరోపించారు.
……………………………………