
* ఎర్రగడ్డలో స్థానికుల ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జనావాసాల మధ్య శవాలు కాల్చొద్దంటూ హైదరాబాద్ ఎర్రగడ్డలో స్థానికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఎర్రగడ్డలోని బ్రిగేడ్ సిటాడెల్ అపార్ఠ్ మెంట్ వెనుక ఉన్న స్థలాన్ని ఇటీవల ప్రభుత్వం శ్మశానం కోసం కేటాయించింది. ఈ నేపధ్యంలో స్థానికంగా ఉన్న అపార్ట్ మెంట్ వాసులు శ్మశాన వాటిక ఏర్పాటును వ్యతిరేకిస్తూ మంగళవారం ఆందోళన చేపట్టారు. శ్మశాన వాటికను వేరే చోటుకి తరలించాలంటూ డిమాండ్ చేశారు. స్థానికుల ఆందోళనకు బీజేపీ ఎంపీ రఘనందన్ రావు మద్దతు తెలిపారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. స్థానికుల కోరిక మేరకు శ్మశాన వాటికను వేరే ప్రాంతానికి తరలించాలని రఘనందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
………………………………………………