
* హైకోర్టులో హరీష్ రావు పిటిషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా నిరోధించాలని తెలంగాణ హైకోర్టును తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆశ్రయించారు. ఆయన పిటిషన్లో, అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టి, దాని ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోరారు. హరీశ్ రావు తరఫు న్యాయవాదులు హౌస్ మోషన్ ద్వారా విచారణ జరగాలని కోరుతున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయాలని గతంలోనూ కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ల ఆధారంగా గతంలో విచారణ చేపట్టిన హై కోర్టు నోటీసులు జారీ చేసి వాయిదా వేసింది. అక్టోబర్ 7న కెసిఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.
……………………………………….