
* డివిజనల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ పులుసం నాగేశ్వరరావు
ఆకేరు న్యూస్, ములుగు:
* తడిగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిక్ తీగలు,
ఇతర పరికరాల ను ముట్టుకోవదని,
డివిజనల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిసిటీ పి నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతము వర్షా బావ పరిస్థితుల్లో భాగంగా ప్రజలు తడి చేతులతో ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్/ఆఫ్ చేయవద్దని
* ఇళ్లలో తడి నేలపై ఎలక్ట్రిక్ తీగలు, పరికరాలు పడకుండా జాగ్రత్తపడాలని సూచించారు.
* ఇండ్లలో బట్టలు ఆరవేసే జి.ఐ దండెము/ వైర్ల వలన విద్యుత్ వైర్ల లో ఇన్సులేషన్ సరిగ్గా లేకపోవడం వలన దండెములకు విద్యుత్ సరఫరా అయ్యి షాక్ గురయ్యే ప్రమాదం ఉందని, కనుక ప్లాస్టిక్ దండెములను ఉపయోగించాలని కోరారు.
* వర్షంలో తెగి పడిన తీగలు, చెట్లపై పడివున్నా, వాహనాలపై పడివున్నా దగ్గరగా వెళ్లవద్దని ,
* ఇళ్లలో ఎలక్ట్రిక్ పరికరాలు వాడిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలని పిలుపునిచ్చారు.
……………………………………….