ఆకేరు న్యూస్, తిరుమల : వైష్ణవాలయాల్లో ఏడాదంతా మూసి ఉండే ఉత్తర ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడు తెరుచుకుంటాయి. శ్రీవారి దర్శనార్థం 3 కోట్ల దేవతల రాకను సూచిస్తూ వీటిని తెరుస్తారు. ఇందులో నుంచి వెళ్లి స్వామిని దర్శించుకుంటే స్వర్గంలోకి ప్రవేశించినంత పవిత్రంగా భావిస్తారు. అలాగే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే భక్తులు వైకుంఠ దర్శణానికి అంతలా ప్రాముఖ్యతనిస్తారు.
……………………………………..
