* ఇండియాలో పెరుగుతున్న డేటింగ్ లు
* వివాహేతర సంబంధాల్లో బెంగళూరు ఫస్ట్
* గుట్టువిప్పిన గ్లేడింగ్ యాప్
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రపంచం అంతా కుగ్రామంగా మారిన నేపధ్యంలో ఆయా దేశాల సంస్కృతీ సాంప్రదాయాలు ఇతర దేశాల ప్రభావానికి గురి అవుతున్నాయి. ఇక ఇంటర్నెట్ ప్రభావం అంతా ఇంతా కాదు చేతిలో సెల్ ఉంటే చాలు చేయాల్సిన పనులు ఎన్ని చేయవచ్చునో చేయకూడని పనులు కూడా అంతే సులభంగా చేయవచ్చు..ఫారిన్ కంట్రీస్ కు సమానంగా ఇండియాలో కూడా డేటింగ్ సంస్కృతి పెరిగందని గ్లీడెన్ యాప్ ను నిర్వహిస్తున్న సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా సంపన్న వర్గాల వారు ఎగువ మధ్య తరగతి వారు ఐటీ ఉద్యోగులు ఎక్కువగా డేటింగ్ లకు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆ సంస్థ తెలిపిన నివేదికలో పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇండియాలో బెంగళూరు మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. సాప్ఠ్ వేర్ రంగం బెంగళూరులోనే ఎక్కువగా ఉంది, వివాహేతర సంబందాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది.
స్వేచ్చను కోరుకోవడం ఎక్కువైంది..
వివాహేతర సంబంధాలు ఎక్కువ కావడానికి రకరకాల కారణాలు ఉంటాయని మానసిక విశ్లేలకులు చెప్తున్నారు. ఆడ వాళ్ల యినా మొగ వాళ్లయినా స్వేచ్ఛను ఎక్కువగా కోరుకోవడం, పార్ట్ నర్ తో అడ్జస్ట్ కాలేక పోవడం కుటుంబ కలహాలు, ఇతరులతో పోల్చుకోవడం ఇంకా ఏదో అనుభవించాలనే తపన ఈ జీవితం తిరిగి రాదు ఉన్నప్పుడే అన్నీ అనుభవించాలనే ఆలోచనతో పక్కదారులు పడుతున్నారని సైక్రియాటిస్టులు చెప్తున్నారు.
సంపన్న వర్గాల్లోనే ఎక్కువ
డేటింగ్ ల సంస్కృతి , సంపన్న వర్గాలు ఎగువ మధ్య తరగతి వర్గాల వారు ఐటీ ప్రొఫెషనల్ష్ ఎక్కువగా కొనసాగిస్తున్నారని గ్లీడెన్ తన నివేదికలో వెల్లడించింది.డబ్బుతో వచ్చే స్వేచ్చను ఈ వర్గాల వారు అనుభవిస్తున్నారని తెలిపింది.కుటుంబాలకు తక్కువ సమయం కేటాయించడం కుటుంబసభ్యుల అవసరాలను పరిగణలోకి తీసుకోక పోవడంతో భాగస్వాములు పక్కచూపులు చూస్తున్నారని గుర్తించారు.
గ్లీడెన్ అంటే ఏమిటి..
గ్లీడెన్ ఒక ఆన్లైన్ డేటింగ్ అప్లికేషన్. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈ యాప్ 2009లో ప్రారంభించబడింది. ప్రధానంగా వివాహేతర సంబంధాల కోసం రూపొందించబడింది. ఇందులో ఉన్న వినియోగదారుల వ్యక్తిగత డేటాను యాప్ గోప్యంగా ఉంచుతుంది. భారతదేశంలో అత్యథిక వినియోగదారులు ఉండడం విశేషం. భారతదేశంలో 30 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు, వైవాహిక జీవితానికి వెలుపల జీవిత రహస్య సంబందాలను కోరుకునే వారు ఈ యాప్ లో చేరుతారు. ఒక సబ్స్క్రైబర్ ఇతర సభ్యులతో కమ్యూనికేట్ చేయడానికి క్రెడిట్ ప్యాక్లను కొనుగోలు చేయవచ్చు. మరొక సభ్యునితో ఇమెయిల్ లేదా చాట్ సంభాషణలో పాల్గొనడానికి 2-3 క్రెడిట్ల వన్-టైమ్ రుసుమును చెల్లిస్తారు. చాటింగ్ ల ద్వారా తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకుంటారు. రోజు రోజుకూ ఈ యాప్ లో సభ్యుల సంఖ్య పెరుగుతుండడం విశేషం. అయితే సంపన్న వర్గాల వారు సమాజంలో పెద్ద పెద్ద హోదాలో చలామణి అవుతున్న వారే ఎక్కువగా ఈ యాప్ లో సభ్యులుగా ఉన్నారని గ్లీడెన్ వెల్లడించింది.
…………………………………..
