
* ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
* కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై అభ్యంతరం
ఆకేరు న్యూస్, డెస్క్ : కేంద్ర ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. ఏదైనా కారణాలతో ప్రజాప్రతినిధి జైలుకు వెళ్లి 30 రోజులు జైలులో గడిపితే 31 వ రోజు రాజీనామా చేయాల్సి ఉంటుందని ఈ బిల్లులో రూపొందించారు. ఈ మేరకు కేంద్రం ఈ రోజు ఈ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టారు. లోకసభలో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం అసదుద్దీన్ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రులను, మంత్రులను కేసుల్లో ఇరికించి తొలగించాలనే కుట్రతోనే కేంద్రం ఈ బిల్లు ప్రవేశపెట్టిందని విమర్శించారు.తమకు అనుకూలంగా లేని పార్టీలను నాయకులను టార్గెట్ చేసేందుకే ఈ బిల్లు రూపొందించారని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ బిల్లు ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని క్రమ క్రమంగా ఓ నియంత రాజ్యంగా మార్చాలని చూస్తున్నారని అసదుద్దీన్ ఆరోపించారు. ఈ బిల్లు పాసైతే దేశంలో పోలీస్ రాజ్యం అమలవుతుందని ఓవైసీ హెచ్చరించారు. కాగా లోకసభలో
ఈ రోజు ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రతిపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి.
………………………………………………