
* జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా
ఆకేరు న్యూస్, జనగామ ; వైద్యుడు దేవుడితో సమానం.. వైద్యులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రొత్సహించాలి.. సమాజ హితం కోసం, ప్రజా రోగ్యం కోసం పాటు పడాలని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. మంగళవారం డాక్టర్స్ డే ను పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనగామ బ్రాంచ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాలాజీ అధ్యక్షతన రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజ హితం కోసం ప్రతి డాక్టర్ సామాజిక దృక్ఫథం కలిగి ఉండాలని కోరారు. డాక్టర్లు త్యాగానికి ప్రతీకలని, ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఐ ఎం ఏ, కెమిస్ట్స్ లను అభినందించారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లో ఐ ఎమ్ ఎ సహకరించాలని కోరారు. రక్తదాతలకు కలెక్టర్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్ డి లవకుమార్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డా. మల్లికార్జున్ రావు, రక్తనిధి వైద్యాధికారి డా పి. కరుణాకర్ రాజు, ప్రభుత్వ వైద్యశాల చీఫ్ పాథాలజిస్ట్ డా అన్వర్, డా. ఏ. శ్రీనివాస్, పుర ప్రముఖులు కన్న పరశురాములు, డా. కల్నల్ మాచర్ల బిక్షపతి, క్రిష్ణ జీవన్ బజాజ్, కెమిస్ట్స్ అసోసియేషన్ నాయకుడు దేవరాజ్, డా సీహెచ్. రాజమౌళి, కెమిస్ట్స్ కార్యదర్శి క్రిష్ణ, దోర్నాల వెంకటేశ్వర్లు, డా. కనకరాజు, డా. వెంకటాచలం, డా. ప్రదీప్, డా. సృజన్, డా . స్వప్నా రాథోడ్, డా . రజినీ, డా. మౌనిక, డా. అనూష, డా. ప్రీతీ దయాళ్, డా . స్వప్న ఐ ఎం ఏ కార్యదర్శి డా. ఏ. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………..