
* రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు
* ధైర్యం ఉంటే వెబ్ కాస్టింగ్ బయటపెట్టండి
* పాలనపై నమ్మకం ఉంటే కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపండి
* జడ్పీటీసీ ఉప ఎన్నికల అక్రమాలపై మాజీ సీఎం జగన్
ఆకేరు న్యూస్, తాడేపల్లి : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని ఏపీ మాజీ సీఎం జగన్ అన్నారు. పులివెందుల, ఒట్టిమిట్టలో జడ్పీటీసీ ఎన్నికలే దీనికి నిదర్శమన్నారు. పులివెందులలోని 15 బూత్‌లలో వైసీపీ ఏజెంట్ లేకుండానే ఎన్నికలు నిర్వహించారని అన్నారు. వైసీపీ ఏజెంట్‌ను బూత్ వద్దకు వెళ్లకుండానే అడ్డగించారని ఆరోపించారు. పులివెందుల ఎన్నికల్లో బందిపోటు దొంగలు ఉండే చంబల్‌లోయను మరిపించారని అన్నారు. సాక్షాత్తూ పోలీసుల సమక్షంలో, పోలీసుల సహకారంతో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. బూత్‌లలోకి వెళ్లే ఏజెంట్ల ఫామ్‌లను చింపేసి ఎన్నికలు నిర్వహించిన ప్రజాస్వామ్యం బహుశా దేశంలోనే ఎక్కడా ఉండదని ఒక్క ఏపీలో తప్ప అన్నారు. బందిపోటు దొంగల తరహాలో చంద్రబాబు ఎన్నికలు జరిపించారని అన్నారు. చంద్రబాబుకు తన పాలనపై నమ్మకముంటే, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకు ధైర్యం వెబ్ కాస్టింగ్ మొత్తం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సీపీ ఫుటేజీలు ఇచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. బయటి నుంచి ఎవరెవరు వచ్చి పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకున్నారో కొన్ని కొన్ని ఉదాహరణలు చూపిస్తానని తెలిపారు. ఒక్కో బూత్‌కు 500 మంది వరకు వచ్చి ఓట్లు వేశారని ఆరోపించారు. మంత్రి సవిత, ఆదినారాయణరెడ్డి, పుత్తా చైతన్య, బీటెక్ రవి వందల మంది కార్యకర్తలతో బూత్‌ల వద్ద తిష్ట వేసి దౌర్జన్యం వేశారని తెలిపారు.
……………………………………..