*సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండండి
* ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక
ఆకేరు న్యూస్, డెస్క్ : మొంథా తుఫాన్ నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు హూంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. కొంత మంది సెన్సేషన్ కోసం సోషల్ మీడియాలో వార్తలు రాస్తారని వాటిని పట్టించుకోవద్దని కోరారు. సోషల్మీడియా కూడా సంయమనం పాటించాలని.. థంబ్నెయిల్స్తో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని కోరారు. మొంథా తుఫాన్ ముప్పును ఎదుర్కొనడానిక ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని అనిత తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కలెక్టర్లు అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. మంత్రి వర్గం మొత్తం తుఫాన్ ను ఎదొర్కొనగానికి సిద్ధంగా ఉందని మంత్రులందరూ ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు ఇస్తున్నారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం యంత్రాగంతో పాటు రాజకీయ నాయకులు ఎన్డీఏ కూటమి నేతలందరూ ప్రజలకు అందుబాటులో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ సీఎంకు అప్డేట్ చేస్తున్నారని తెలిపారు.
……………………………………
