* ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని… ఇలాంటి దశలో సమ్మె చేయొద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని.. సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావొచ్చన్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆర్టీసీ సంఘాల నేతలు మంత్రిని కలిసి ఆర్టీసీ సమస్యలను విన్నవించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమస్యలపై, ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా నేడు, రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పవచ్చని, తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానన్నారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. మంత్రితో భేటీ అయినవారిలో ఆర్టీసీ జేఏసి చైర్మన్, టీఎంయూ జనరల్ సెక్రెటరీ అశ్వద్ధామ రెడ్డి, ఎన్ఎంయూ జనరల్ సెక్రెటరీ నరేందర్, కార్మిక సంఫ్‌ు జనరల్ సెక్రెటరీ ఎర్ర స్వామి కుమార్, ఎస్టీఎంయూ జనరల్ సెక్రెటరీ పున్న హరి కృష్ణ, పలువురు ఆర్టీసీ సంఘాల నేతలు ఉన్నారు.
…………………………………..
