
* కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు
*పెట్టుబడులకు రక్షణ కల్పిస్తాం
* సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధిరి పణంగా పెట్టే నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకోదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. CREDAI నిర్వహిస్తోన్న హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. అపోహలు, అనుమానాలను దాటుకుకుని రాష్ట్ర అభివృద్ధిలో ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని సీఎం చెప్పారు. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నానని సీఎం తెలిపారు. స్వదేశీ పెట్టుబడుల విషయంలో కొంతమంది కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని కోరారు
తాను సగటు మద్య తరగతి మనిషిని అని సీఎం అన్నారు. ప్రజల సంపదను కొల్లగొట్టి విదేశాలకు
తరలించే ఉద్దేశ్యం తనకు లేదని రేవంత్ అన్నారు.పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. పెట్టుబడులకు రక్షణ కల్పించడమేకాదు.. లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది.. మాది. రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు మోసపోవద్దని రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు
………………………………………….