
* తెలుగువారందరూ ఏకం కావాలి
* ఓటు తొలగించే వారికి ఓటును కాపాడే వారికి మధ్య పోటీ
*జస్టిస్ సుదర్శన్ రెడ్డి ని గెలిపించుకుందాం
* తెలుగు ఎంపీలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో తెలుగువారి ప్రాధాన్యత తగ్గిపోతోందని తెలుగు వారు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం తాజ్ కృష్ణాలో
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. నీలం సంజీవ రెడ్డి, పీవీ నర్సింహారావు,
నందమూరి తారక రామారావు, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని రేవంత్ అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి ఎన్డీయే కూటమికి సవాల్ విసిరామని సీఎం రేవంత్ అన్నారు. ఈ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని
మార్చాలనుకునే వారు ఓటు హక్కును తీసేయాలనుకునే వారు ఓ పక్క పోటీ చేస్తే రాజ్యాంగాన్ని
ఓటు హక్కును కాపాడాలనుకునే వారు మరో పక్క పోటీ చేస్తున్నారని రేవంత్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు తావు లేకుండా రాజ్యాంగాన్ని,ఓటు హక్కును కాపాడుకోవాలని రేవంత్ సూచించారు. కొంతమంది జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నక్సలిజాన్ని ఫిలాసఫితో గెలవాలి కానీ అంతం చేస్తామంటే ఎలా అన్ని రేవంత్ ప్రశ్నించారు.తెలుగు వ్యక్తికి మద్దతు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లకు విజ్ఞప్తి చేశారు. ఆత్మప్రభోదానుసారం ఉప రాష్ట్రపతి అభ్యర్థికి ఓటేయాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలకు సీఎం రేవంత్ సూచించారు.
……………………………………………..