
* గ్రూప్ వన్ ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తమ పిల్లల జీవితాలతో రాజకీయం చేయొద్దని తమ పిల్లల భవిష్యత్ తో ఆటలాడుకోవద్దని గ్రూప్ 1అభ్యర్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మంగళవారం హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసినమీడియా సమావేశంలో వారు మాట్లాడారు.పిల్లలు కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకుంటే 3 కోట్ల లంచం ఇచ్చిఉద్యోగాలు పొందారని నిందలు వేస్తున్నారని ఆరోపించారు.ఈ నెల 9న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలోగ్రూప్ 1 అభ్యర్థుల తల్లిదండ్రులు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.పేపర్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయనిహైకోర్టు గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేసింది. పేపర్ అమ్మింది ఎవరు కొన్నది ఎవరో ఆధారాలు చూపాలని వారు డిమాండ్ చేశారు.రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల్ని కష్టపడి చదివించుకున్నామని వారు అన్నారు. కోట్లు కోట్లు పెట్టి పేపర్ కొనేంత స్థోమత తమకు లేదని వారు పేర్కొన్నారు. రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాలతో పిల్లల్ని బలి చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
……………………………………………….