
* బీఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి
* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేటీఆర్
* అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తామంటే నమ్ముతామా..
* రేవంత్ రెడ్డిపై విమర్శలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దని బీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గోపీనాథ్ అకాల మరణం పార్టీకి తీరని లోటన్నారు. అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని శ్రేణులకు సూచించారు. హైదరాబాద్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని గుర్తు చేశారు. హైదరాబాద్ లక్ష మంది పేదలకు కేసీఆర్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్ వచ్చాక రేషన్‌కార్డుపై ఉన్న 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలు చేశారని, ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికీ ఇచ్చారని కేటీఆర్ వెల్లడించారు. పిల్లలకు స్కూళ్లలో సన్నబియ్యంతో బువ్వ పెట్టిన ఘతన కేసీఆర్‌దే అన్నారు. సన్నబియ్యం అనేది కాంగ్రెస్ కొత్తగా తేలేదని, మనమే ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ లో మనమే తెచ్చామన్నారు. అలాగే అందరికీ నల్లా బిల్లులు ఫ్రీ చేశామన్నారు. ప్రాపర్టీ బిల్లును కూడా తగ్గించారన్నారు. 200 ఉన్న పింఛనును 2000 చేసింది కేసీఆర్ అన్నారు. ఆడబిడ్డ పుడితే 13000, మగపిల్లోడు పుడితే 12000 అంటూ ప్రభుత్వ దవాఖానాల ఖ్యాతిని పెంచారని తెలిపారు. ఎన్నడూ కులం, మతం పేరుతో కేసీఆర్ రాజకీయాలు చేయలేదన్నారు. ఆయన హయాంలో హిందూ, ముస్లిం పంచాయితీ లేదని, ఆంధ్ర, తెలంగాణ పంచాయతీ లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి (REVANTHREDDY) చాలా మాటలు చెప్పారని పింఛను 4000 చేస్తారన్నారని ఇస్తుంరా అన్నారు. ఇంట్లో ప్రతీ అమ్మాయికీ 2500 అన్నారని ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తామంటే నమ్ముతామా.. అని ప్రశ్నించారు.. కాంగ్రెసోల్లు లంగావాళ్లని నమ్మొద్దు అంటే హైదరాబాద్ వాళ్లు నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేయలేదని గుర్తు చేశారు. ముఖం బాగోలేక అద్దం పగులగొట్టుకున్నట్లు.. వీళ్లకు చేతకాక కేసీఆర్ (KCR) ఇచ్చిన కరంటును సక్రమంగా చేయలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలను విమర్శించారు.
……………………………………..