
* జూన్ 3 నుంచి 13 వరకు పరీక్షలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈరోజు విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కొంత మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. పాస్ కాలేదని బాధ పడకుండా, కుంగిపోయి అఘాయిత్యాలకు పాల్పడకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ కావచ్చు. ఈమేరకు పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం ఎస్ ఎస్సి బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు (10th Supplementaray) నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 3 నుంచి 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. విద్యార్థులు మే16 లోపు స్కూళ్లలో ఫీజు చెల్లించాలని సూచించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సబ్జెక్టు రీ కౌంటింగ్ (Recounting) కు రూ.500, రీ వెరిఫికేషన్ రూ(Re verification) 1000 చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా, సప్లిమెంటరీ పరీక్షలు రాయాలని సూచించింది.
…………………………………………