ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి టిఆర్ఎస్ లోనే ఉన్నాడని, పార్టీ కిరాయించలేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి తూట్లు పొడిచిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ టిఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం, తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పుకున్న శ్రీహరికి పార్టీ మారలేదని క్లీన్ చీట్ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్క్రిప్ట్, రాహుల్ గాంధీ బలపరిస్తే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆమోదించడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ దీపా దాస్ ఆహ్వానం మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ముందుంది ముసళ్ళ పండుగ అన్నారు. ధర్మసాగర్ మండలం షోడశ పల్లి లో ఎదురైన చేదు అనుభవాలు రేపు రేపు స్టేషన్ ఘన్ పూర్ కు వస్తే నిలదీయడం కాయం అన్నారు. టిఆర్ఎస్ తాళి కట్టుకుని కాంగ్రెస్ తో కాపురం చేస్తున్న శ్రీహరికి ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్న వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మంజూరైన పనులను కాంట్రాక్టర్ల లబ్దికోసం కమిషన్ల కోసం తానే చేయించానని నమ్మ పలుకుతున్న కడియం శ్రీహరి నిజ స్వరూపం బయటపడే రోజులు దగ్గరనే ఉన్నాయి అన్నారు. ఇటీవల మంజూరైన ఈజీఎస్, 15 ఫైనాన్స్ నిధుల కేటాయింపులు ఎమ్మెల్యే వివక్ష చూపడం జిట్ట గూడెం, రాఘవపూర్, లింగంపల్లి, కృష్ణాజి గూడెం గ్రామాలకు నిధులు కేటాయించక పోవడం నిదర్శనం అన్నారు. రాకపోవడమే అన్నారు. గతంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను అన్ని గ్రామాలకు సమంగా పంచామన్నారు. కాంగ్రెస్ తో కలిసి పని చేస్తున్న నువ్వు 420 హామీలు, ఆరు గ్యారెంటీ లపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయకుంటే టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంతరం నిలదీస్తాం, అడ్డుకుంటాం ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు.
