
ఆకేరు న్యూస్, జనగామ: జనగామ జిల్లా నాగిరెడ్డి పల్లె గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువైన నేపధ్యంలో గ్రామంలో మైనర్లు బండి నడిపితే వారి బెండు తీసేవిధంగా గ్రామస్థులు అందరూ కలిసి మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. ఇక ముందు గ్రామంలోని మైనర్లు బండి నడిపితే వారిపై లక్ష రూపాయల జరిమానాతో పాటా వారి తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు గ్రామస్థులందరూ కలిసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. నాగిరెడ్డి పల్లె గ్రామస్థులు తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రజలు హర్షిస్తున్నారు.
……………………………………………..