* మొంథా తుఫాన్ తో మూడు రోజులూ వర్షాలు
* వాతావరణ శాఖ హెచ్చరిక
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.రేపు ,ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాల పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు ప్రకటించారు.రేపు పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి,ములుగు జిల్లాల్లో బుధవారం ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్,జయశంకర్ భూపాలపల్లి,ములుగు ,నిర్మల్, మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.అలాగే మొత్తం 19 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
…………………………………………..
