
* డీఆర్ ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి
* కవిత మాటే నేనంటున్నాను…
* తొడగొట్టి చాలెంజ్ చేసిన..కేసీఆర్ను గద్దెదించుతానని
* మూసీనది ప్రక్షాలన చేసి తీరుతాం
* చైతన్యానికి మారుపేరు నల్గొండ జిల్లా
* బీఆర్ ఎస్ నల్గొండకు చేసిందేమీ లేదు
* లక్ష్మీనర్సింహస్వామి ఆశీస్సులతో జిల్లాను అభివృద్ది చేస్తాం
* ఆలేరులో ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, ఆలేరు : తెలంగాణలో ఉన్న కొరివి దయ్యాలను తెలంగాణ పొలిమేరలు దాటే విధంగా తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆలేరులో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.. బీఆర్ ఎస్ లో దయ్యాలు ఉన్నాయని కేసీఆర్ కూతురు కవిత అన్నారని.. ఆది బీ ఆర్ ఎస్ పార్టీ కాదని డీ ఆర్ ఎస్ పార్టీ అని సీఎం రేవంత్ అన్నారు. డీఆర్ ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి అని రేవంత్ ఎద్దేవా చేశారు.. కేసీ ఆర్ పదేళ్లలో రాష్రానికి కానీ నల్గొండ జిల్లాకు కానీ చేసిందేఈ లేదని రేవంత విమర్శించారు పదేళ్లలో గండమల్ల ,ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని రేవంత్ విమర్శించారు. వాసాలమర్రిని దత్తత గ్రామంగా తీసుకుంటానని మాయమాటలు చెప్పి వాసాలమర్రిని ఆగం ఆగం చేసిండు కేసీ ఆర్ అని రేవంత్ ఎద్దేవా చేశారు. మూసీ నదిని ప్రక్షాలన చేస్తామంటే అడ్డుకుంటున్నారని ఎవరు అడ్డమచ్చినా నల్గొండ జిల్లాకు శాపంగా మారిన మూసీ నదిని ప్రక్షాలన చేసి తీరుతామని రేవంత్ రెడ్డి అన్నారు. తిరుమల తిరుమతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టను డెవలప్ చేసి తీరుతామని సీఎం అన్నారు. టీడీడీ తరహాలో వైటీడీని ఏర్పాటు చేసి యాదగిరి గుట్టను అభివృద్ది చేస్తామని రేవంత్ అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ నిర్వహిస్తున్న విధంగా వైటీడీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలను నెలకొల్పి యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తామని సిఎం అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ఎస్సారెస్పీ మిడ్ మానేర్ ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిని కాదా అని రేవంత్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలు ఆర్థిక స్వాలంబనకు కృషి చేస్తున్నామని రేవంత్ అన్నారు. మహిళలు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు పెట్రోల్ బంకులు ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను అప్పగించి వారిలో ఆత్మస్తైర్యాన్ని నింపామని సీఎం రేవంత్ అన్నారు. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలుమహిళలను కోటీశ్వరులను చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ అన్నారు.రానున్న రోజుల్లో ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని రేవంత్ అన్నారు. దేశంలో భూ సంస్కరణలు అమలు చేసిందే ఇందిరమ్మని రేవంత్ గుర్తు చేశౄరు. మళ్లీ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చామని సీఎం అన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణం మాఫీ చేసి రైతులను ఆదుకొన్నామని రేవంత్ అన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలతో యువకుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తున్నాం అనిసీఎం అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేశామని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నా కలగణన ను చేపట్టి బీసీలకు న్యాయం చేశామన్నారు. కులగణనతో దేశానికి ఆదర్శంగా నిలిచామని రేవంత్ అన్నారు. ఇంటిగ్రేడెట్ స్కూల్స్ స్థాపనతో విద్యా రంగంలో విప్తవాత్మకమైన మార్పలు తెచ్చామని అన్నారు.6వందల కోట్లతో గందమల్ల ప్రాజెక్టును పూర్తచేస్తామని సీఎం రేవంత్ అన్నారు. దేశానికి ప్రధానిగా పని చేసిన పీవీ నర్సింహారావు లాంటి వరే ఆరోపణలు వస్తే సెషన్స్ జడ్డి ముందు హాజరై ప్రజాస్వామ్యవిలువలు కాపాడారని కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకావడాని కేసీ ఆర్ కు ఎందుకు అభ్యంతరమో అని ప్రశ్నించారు. కేసీ ఆర్ ది దొరపోకడ అని కేసీ ఆర్ కు ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం లేదని సీఎం అన్నారు. ఎవరు ఎంత అడ్డం వచ్చినా ఎంత దుష్ప్రచారం చేసినా లక్ష్మీనర్సింహ స్వామి ఆశీస్సులతో రాష్ట్రాని్న అభివృద్ధి చేసి తీరుతామని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణను ప్రపంచదేశాలతో పోటీ పడి వాటికి సమానంగా అభివృద్ది చేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
………………………………………………………………….