
* పోలీసుల అదుపులో 51మంది ఆఫ్రికన్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆగస్టు 15 స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం తన ప్రసంగంలో చెప్పిన కొన్ని గంటలకు నగర శివారులోని మొయినాబాద్ మండలం బాకారంలోని SKM ఫాం హౌస్ లో 51 మంది ఆఫ్రికన్లు మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు.అందులో 37 మంది మహిళలు ఉన్నారు.ఈ ఫామ్ హౌస్‌లో డ్రగ్స్, లిక్కర్ పార్టీ జరుగుతోందని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు నార్కోటిక్ బ్యూరో అధికారులతో కలిసి ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించారు. దీనిలో 51 మందికిపైగా ఆఫ్రికా దేశస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ
ఈ పార్టీలో పాల్గొన్న మొత్తం 51 మంది ఆఫ్రికన్లను అదపులోకి తీసుకున్నారు. అయితే, అందరికీ డగ్స్ పరీక్షలు నిర్వహించగా.. అందులో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది.. అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమాచారం అందించారు.. వారు కూడా అక్కడకు చేరుకుని వారి వీసాలను పరిశీలిస్తున్నారు. విదేశీయులు పార్టీకి పర్మీషన్ తీసుకున్నారా.. లేదా..? విదేశీ మద్యం, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. దాదాపు 100 మంది పోలీసు బందోబస్తుతో బాకారం ఎస్కేఎం ఫామ్‌హౌస్‌లో సోదాలు కొనసాగుతున్నాయి.
………………………………………