*కేసు కొట్టివేసిన న్యాయస్థానం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో నవదీప్ కు బిగ్ రిలీఫ్ లభించింది, అప్పట్లో టాలీవుడ్ లోని సినీ ప్రముఖులకు డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయని చాలా మంది రహస్యంగా డ్రగ్స్ వినియోగిస్తున్నరనే ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో హీరో నవదీప్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. తనకు, డ్రగ్స్‌కు ఎలాంటి సంబంధం లేదని తనను అరెస్ట్ చేయొద్దంటూ అతను గతంలో తెలంగాణా హైకోర్టును ఆశ్రయించాడు. అప్పట్లో ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ కేసుపై మరోసారి విచారణ చేపట్టింది న్యాయస్థానం. నవదీప్ పేరును కేవలం ఎఫ్ఐఆర్లోనే చేర్చారని.. అతను డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాలేవీ లేవని స్పష్టం కావడంతో ఈ కేసును కొట్టివేసింది.

