
*ఆరుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల అరెస్ట్
ఆకేరున్యూస్ హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ ను నియంత్రించలేక పోతోంది. సంపన్న వర్గాల వారు లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు విలాలకు అలవాటు పడి డ్రగ్స్ కు బానిసలవుతున్నారు.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఫాం హౌజుల్లో యువత పార్టీల పేరుతో డ్రగ్స్ ను వినియోగిస్తున్నారు.తాజాగా చేవెళ్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ (DRUGS) మరోసారి కలకలం రేపాయి. ఓ ఫామ్‌హౌస్‌లో ఐటీ ఉద్యోగులు బర్త్ డే పార్టీ(BIRTH DAY PARTY) చేసుకున్నారు. బర్త్ డే పార్టీలో డ్రగ్స్(DRUGS) వినియోగిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ టీం ఫామ్ హౌస్‌లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో రెండు లక్షల విలువైన డ్రగ్స్, ఖరీదైన మద్యం గుర్తించారు పోలీసులు. డ్రగ్స్, మద్యం బాటిళ్లతో పాటు రూ.50లక్షల విలువైన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటితో పాటు ఆరుగురు ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేసి, ఫామ్‌హౌస్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో(TELANGANA ANTI -NARCOTICS BUREAU ) స్థానంలో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్(EAGLE) ఏర్పాటు చేసింది. ఈ కొత్త సంస్థ మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాలపై నిఘా మరియు అమలును ముమ్మరం చేసింది.అయినప్పటికి రాష్ట్రంలో ఇప్పటకి కూడా ఎక్కడో ఓ చోట డ్రగ్స్ బయటపడుతునే ఉన్నాయి.
…………………………………….