* తాగి వాహనం నడిపి పట్టుబడ్డ 409 మంది
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేసులు.. ఫైన్లు.. జైలు శిక్షలు కూడా కొందరిని మార్చడం లేదు. తాగి వాహనం నడిపి మళ్లీ మళ్లీ పట్టుబడుతున్నారు. అందుకు నిదర్శనంగా వారం రోజుల్లో డ్రంకెన్ డ్రైవ్లో 409 మంది మద్యం తాగి వాహనాలను నడిపి పట్టుబడడం. వీరిలో కొందరు రెండో సారి పట్టుబడినట్లు తెలిసింది. వారిపై కేసులు నమోదు చేశామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కేసులు నమోదైన వారిలో 290మంది ద్విచక్ర వాహనదారులు, 23 ఆటో రిక్షా, 95 కార్లు, ఒక భారీ వాహనం డ్రైవర్ ఉన్నారు. ఒక్క మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 81 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇలా 16 ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి, మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్న వారిని గుర్తించి, వీరందరినీ చట్ట పరంగా కోర్టులో హజరుపర్చామని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత-2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని, ఈ నేరానికి గర్ష్టి శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. గత వారం 15 నుంచి 20 వరకు 756 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించామని, వీరిలో ఇద్దరికి జరిమానా, జైలు శిక్ష, సామాజిక సేవ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందని, మిగతా 754 మంకి జరిమానా విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
……………………………………….

