* నిర్వహణ ఈ ఏడాది ఆలయ ప్రాంగణంలో..
* దుర్గాదేవి విగ్రహా ప్రతిష్టించేందుకు అనుమతి కోరిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
ఆకేరున్యూస్ వరంగల్ : శ్రీ రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల ఆలయంలో ఈ నెల 22 నుండి వచ్చే నెల 02 తేది వరకు ఎంతో వైభవంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలోని మారేడు చెట్టు కింద దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అనుమతి కోరారు. ప్రతి ఏడాది లక్షలాదిమంది భక్తులు వేయి స్తంభాల ఆలయంలోనే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి విగ్రహన్ని ప్రతిష్టచడంతో పాటు ప్రత్యేకంగా రాత్రి 9 గంటల వరకు దర్శనాలకు అదనపు సమయాన్ని కల్పించాలని పురావస్తు శాఖ అధికారులను ఎంపీ కోరారు. ఈ మేరకు ఎంపీ డా. కడియం కావ్య గారి అభ్యర్ధన పట్ల వెంటనే స్పందించిన పురావస్తు శాఖ అధికారులు, ఈ ఏడాది ముందస్తుగానే అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతితో భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకుంటూ, పూజా కార్యక్రమాల్లో పాల్గొనగలరని ఎంపీ కోరారు..
…………………………
