Station Ghanpur| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం దుర్గామాత అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని తాటికొండ గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించడంతో పాటు గణపతి పూజ, నవగ్రహ పూజ, అర్చన, హోమం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం కుంకుమ పూజ, అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పండగ బుచ్చయ్య, అర్చకుడు జీడికంటి వరుణాచార్యులు, భవాని మాల స్వాములు పండగ రాజేశ్వర్, పర్శ రాజు, పండుగ సత్తయ్య, పండుగ రవి, అక్కెనపల్లి రాములు, మారపాక నాగరాజు, అక్కెనపల్లి రాకేష్, శ్రీపతి రాజు, నారబోయిన కార్తీక్, చిలువేరు వర్షిత, మొగ్గం ప్రవస్థి, మారపాక మానస తదితర భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
అలాగే స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు, శివునిపల్లి, స్టేషన్ ఘన్ పూర్ ప్రాంతాల్లోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

