* అసెంబ్లీలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల నినాదాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్ రేస్‌పై చర్చకు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో బీఆర్ఎస్(Brs) పట్టుబడుతోంది. ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(Ktr)పై పెట్టిన కేసు ముమ్ములాటికీ అక్రమ కేసే అని హరీశ్‌రావు(Harishrao) పేర్కొన్నారు. బీఆర్ ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారు. తాము రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేశామని, అందుకే ఈ-కార్ రేస్‌పై చర్చకు పట్టుబడుతున్నామని తెలిపారు. దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి (Revuri Prakashreddy)బదులిస్తూ.. గవర్నర్ అనుమతి ఇచ్చాక.. కేటీఆర్ పై ఏసీబీ కేసు పెట్టాక చర్చకు ఆస్కారమే లేదని అన్నారు.
…………………………………….