* గేమ్ ఛేంజర్‌కు ఎందుకు అదనపు షోలు
* సీఎం రేవంత్‌పై ఫైర్ అయిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
ఆకేరున్యూస్, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి నిరూపితమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గేమ్ ఛేంజర్ సినిమాకు ఎందుకు అదనపు షోలు..? టికెట్ రేట్ల పెంపు ఎందుకు..? అని దేశపతి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతిస్తూ జారీ చేసిన జీవోతో రేవంత్ రెడ్డిది రెండు నాల్కల ధోరణి అని అర్థమైపోయిందన్నారు. టికెట్ల పెంపుదల ఉండడని అసెంబ్లీ సాక్షిగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. ఆయన ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు. ఈ జీవోపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజాయితీ లేని ముఖ్యమంత్రి, మంత్రలు ఉండటం దురదృష్టకరమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
…………………………………………………