* తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి వర్షాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలనురుతుపవనాలు ఈసారి కాస్త ముందే పలకరించనున్నాయి. వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య తెలంగాణాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరు నాటికి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ మీదుగా తెలంగాణకు చేరుకుంటాయి. ఇందుకు కనీసం అయిదారు రోజుల సమయం పడుతుంది. ఆ ప్రకారంగా చూస్తే జూన్ 5 నుంచి 8 తేదీల మధ్య రుతు పవనాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది.
రాష్ట్రమంతటా విస్తారంగా..
వచ్చే నెల రెండో వారంలో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది ఆలస్యంగా రుతుపవనాలు జూన్ 11 నాటికి కేరళకు వచ్చాయి. తెలంగాణలో రావడానికి జూన్ 20వ తేదీ దాటింది. కానీ ఈసారి సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో నైరుతి రుతువపనాల ఆగమనం కాస్తముందుగానే వచ్చేశాయి.
మూడు రోజులపాటు వర్షాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్త్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
—————–