
* వికారాబాద్ జిల్లాలో..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వికారాబాద్ జిల్లాలోని పరిగి పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పరిగి పరిసర ప్రాంతాల్లోని రంగాపూర్, బసిపల్లి, న్యామత్‌నగర్‌లో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గిన్నెలు, పాత్రలు కింద పడడంతో ప్రజలు నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై భూప్రకంపనలు ఎంత నమోదైందన్న వివరాలు అధికారులు వెల్లడించలేదు.
……………………………………….