* 23న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం
ఆకేరున్యూస్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ కాగా.. ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలైన విషయం విదితమే. మరోవైపు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సైతం రెండ్రోజుల క్రితం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయనను జనవరి 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వైసీపీ పభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డి ఆస్తులను సైతం ప్రభుత్వానికి అటాచ్ చేశారు. అలాగే ఈ కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారు బెయిల్పై బయట ఉన్నారు. ఈ స్కామ్లో తవ్వే కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా.. ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో కీలక పాత్ర పోషించారనే ప్రచారం సాగుతోంది. దాంతో విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ ముందు రోజే విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే వైసీపీతోపాటు రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
………………………….
