* 16న విచారణకు రావాలని ఆదేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి ఈడీ ఎదుట కేటీఆర్ ఈ రోజే హాజరుకావాల్సి ఉంది. అయితే, ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వ్‌లో ఉందని తెలిపారు. హైకోర్టుపైనున్న గౌరవంతో.. తీర్పును వెలువరించేంత వరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ సమాధానం పంపారు. అయితే ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమకేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
…………………………………………..