* నెట్ వర్క్ మాయతో విద్యార్థులకు గాలం
* దేశవ్యాప్తంగా 22 ఒక్క ఢిల్లీలోనే 9
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుకుంటున్నారు. ఏకంగా ఫేక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి ఉన్నత విద్యను అందిస్తామని
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు లేకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు లేకుండా యూనివర్సిటీల నడపిస్తున్నారు. ఏది నిజమైనదో.. ఏది ఫేక్ యూనివర్సిటో తెలుసుకోలేని విద్యార్థులు సమయంతో పాటు డబ్బును కూడా
వృధా చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దేశ వ్యాప్తంగా 21 నకిలీ యూనివర్సిటీలు చలామణిలో ఉన్నట్లు గుర్తించింది. ఆ యూనివర్సిటీలు ఇచ్చే సర్టిఫికెట్లకు విలువ ఉండదని హెచ్చరించింది. అనుమతి లేని కోర్సులను కూడా అనుమతి ఉన్నట్లు విద్యార్థులను చేర్చుకొని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని హెచ్చరించింది. ఆయా కోర్సులకు సంబంధించి ఏఐసీటీఈ (ఇంజినీరింగ్, మేనేజ్మెంట్), పీసీఐ (ఫార్మసీ), ఎన్ఎంసీ (మెడికల్) వంటి సంబంధిత కౌన్సిల్స్ నుండి సంస్థకు, కోర్సులకు అనుమతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని తెలిపింది. యూజీసీ తమ అధికారిక వెబ్సైట్లో గుర్తించబడిన విశ్వవిద్యాలయాలు, నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుందని.. విద్యార్థులు ఆ జాబితాను తప్పక పరిశీలించాలని యూజీసీ సూచించింది. నకిలీ సంస్థల్లో చేరితే, ఆ డిగ్రీల ఆధారంగా ఉద్యోగాలు లేదా ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లడం సాధ్యం కాదని హెచ్చరించింది. డిల్లీ కోట్లా ముబారక్పూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తాజాగా మరోసారి హెచ్చరికలు జారీచేసింది.ఆ సంస్థ జారీ చేసే డిగ్రీలకు ఎలాంటి అనుమతి లేదని తెలిపింది. దానితో సాటు మిగతా నకిలీ యూనివర్సిటీల జాబితాను యూజీసీ విడుదల చేసింది.యూనివర్సిటీల్లో
ప్రవేశం పొందేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థులు UGC అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేసుకోవాలని యూజీసీ అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా దేశ రాజధానితో సహా మిగతా రాష్ట్రాల్లో ఫేక్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్న యూనివర్సిటీల జాబితాను యూజీసీ విడుదల చేసింది. ఢిల్లీలో 4,ఉత్తరప్రదేశ్ లో 4,ఆంధ్రప్రదేశ్ లో 3,పంజాబ్ లో 3,కర్ణాటకలో 2,పశ్చిమబెంగాల్ లో 2,తమిళనాడులో 1,కేరళలో 1,మహారాష్ట్రలో 1,హరియాననా 1,తెలంగాణ 1,బిహార్ లో 1, జమ్ము కాశ్మీర్ లో 1 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
……………………………………………………………
