* టీచర్ సుజాతని ఆదర్శంగా తీసుకోవాలి
ఆకేరు న్యూస్,స్టేషన్ ఘన్ పూర్:
స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు కె. సుజాత తాను పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులకు బుధవారం స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో సుజాత (ఎస్ జి టి) కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె స్వచ్ఛంద స్వచ్ఛంద పదవి విరమణ చేసిన సందర్భంగా పాఠశాలలోని 30 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాశాఖ అధికారి కొమురయ్య మాట్లాడుతూ సుజాతని ఆదర్శంగా తీసుకొని తాము పనిచేస్తున్న పాఠశాలకు, విద్యార్థులకు తోడ్పాటును అందించి విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షరీఫ్ ఉన్నిసా, పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు రెడ్డి ప్రమోద్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ కాంప్లెక్స్ హెచ్ఎం సంపత్, వంగ రఘు, శ్రీపతి పల్లి హెచ్ఎం అంకం సంపత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
