
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ఆకేరు న్యూస్, ములుగు: జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో నూతన సిలబస్ ప్రకారం ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను బోధించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. శుక్రవారం ములుగు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లోని మల్లంపల్లి అంగన్ వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కలెక్టర్ అంగన్వాడి లో తల్లులతో మాట్లాడుతూ పిల్లలు ఇక్కడే భోజనం చేస్తున్నారా , లేదా ఆరా తీశారు. సామ్ పిల్లలు, మ్యామ్ పిల్లల గ్రోత్ ఎలా ఉందని, ఏ ఫుడ్ ఇస్తున్నారు, బాలమృతం ఇస్తున్నారా లేదా అని అంగన్వాడీ కార్యకర్త ను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను ప్రతి ఒక్కరూ అంగన్వాడి కేంద్రానికి పంపాలని తల్లుల కు సూచించారు. కిచెన్ షేడ్ ను, తనిఖీ చేశారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించి చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యను బోధించాలని, వారితో మమేకమై గేయాలు పాడించలన్నారు. అన్ని అంగన్వాడి కేంద్రాలలో నెలవారి సిలబస్ ను కచ్చితంగా అమలు చేయాలని అన్నారు. గర్భిణీలు, బాలింతలకు మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం వేడివేడిగా ఇవ్వాలని సూచించారు. క్రమం తప్పకుండా పిల్లల బరువు, ఎత్తు తూచాలని, బరువు తక్కువగా ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి సాధారణ బరువు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలకు ఇవ్వాల్సిన పోషకాహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అతిగా బరువు తక్కువ ఉన్న పిల్లలను ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీ డబ్ల్యు ఓ టి. రవి, సిడిపిఓ కే. శిరీష, సూపర్వైజర్ ఖమురునిసా బేగం, అంగన్వాడి టీచర్లు మల్లికాంబ, ప్రియాంక, అంగన్వాడి పిల్లలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..