
* గాంధీభవన్ వద్ద రైతు ధర్నా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి రైతు రుణమాఫీ అశనిపాతంలా మారింది. ఆర్థికంగా సర్కారును కుదేలుచేయడంతో పాటు, వేలాది కోట్లను రైతుల ఖాతాల్లో వేసినప్పటికీ విమర్శల పాలవుతోంది. మాఫీలో లోటుపాట్లను ఎత్తిచూపుతూ విపక్షాలే కాదు.. సామాన్యులూ ఆరోపణలు చేస్తున్నారు. చాలా మంది రైతులకు రుణమాఫీ (Runa Maafi)కాకపోవడంతో.. రేవంత్ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారు. అవకాశం ఉన్న చోట రైతులు నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఓ వృద్ధ రైతు.. హైదరాబాద్‌లోని గాంధీ భవన్(Gandhi Bhavan)కు చేరుకుని ధర్నాకు దిగాడు. తనకు రుణమాఫీ చేసే వరకు ఇక్కడ్నుంచి కదిలేది లేదని ఆ రైతు తేల్చిచెప్పాడు. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన తోట యాదగిరి మాట్లాడుతూ.. “55 క్వింటాళ్ల 80 కిలోల ధాన్యాన్ని విక్రయించాను. కానీ ఇప్పటి వరకు బోనస్ రాలేదు. అంతే కాదు రుణమాఫీ కూడా కాలేదు.. ఇటు పెన్షన్లు లేవు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయాలి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు నేను ఇక్కడ్నుంచి కదలను. నేను అబద్ధమాడితే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే” అని రైతు తోట యాదగిరి తేల్చిచెప్పాడు.
……………………………………………