
* మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటి కార్యాలయంలో మార్కెట్ కమిటి కార్యదర్శి సోనియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశంలో మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి మాట్లాడుతూ ములుగు మార్కెటును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పాలకవర్గం ముందుకు సాగుతుందని అన్నారు. గత ఏడు సంవత్సరాల నుండి మార్కెట్ కమిటి పాలకవర్గం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంన్నారని, మార్కెట్ కమిటి సమస్యలపై దృష్టి సారించి మార్కెట్ అభివృద్ధికి బాటలు వేస్తామని అన్నారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గతంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపుతామని అన్నారు. లైసెన్స్ లేని పత్తి కొనుగోలు దారుల అక్రమాలను నివారించి, రైతుల దగ్గర నుండి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అన్నారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని వివరించారు. ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటి పాలకవర్గ సభ్యులు వైస్ చైర్మన్ సెద సారంగం, గోవిందరావుపేట మండల సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, రసపుత్ సీతారాంనాయక్, కొమరం బాలయ్య, లక్కీ వెంకన్న, ముక్తి రామస్వామి, చెర్ప పగడయ్య, పాలకుర్తి సమ్మయ్య, అర్రెం వెంకన్న, ఆలోత్ దేవ్ సింగ్, పెద్ది రాజ్ కుమార్, పోరిక ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
………………………………………………