
* టీడీసీ సీనియర్ నాయకుడు దరావత్ దేవానాయక్
ఆకేరు న్యూస్, ములుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బరిలో నిలిపి గెలుపు కోసం కృషి చేస్తానని టీడీపీ సీనియర్ నాయకుడు దరావత్ దేవానాయక్ తెలిపారు. ములుగు నియోజకవర్గంలో గతంలో టిడిపి పార్టీ బలం గా ఉండేదని క్రమశిక్షణ నిబద్ధత కలిగిన కార్యకర్తలు టీడీపీ అభిమానులు ఇప్పటికీ గ్రామాలలో ఉన్నారని అన్నారు. చంద్ర బాబు నాయుడు టీడీపీ పార్టీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోఅధికారం లో ఉన్నప్పుడు హైదారాబాద్ లో భారీ పరిశ్రమలతో పాటు హైటెక్ సిటీ నిర్మాణం జరిందని అన్నారు. ములుగు నియోజక వర్గం కమలాపూర్ లోభారీ పరిశ్రమ నెలకొల్పడం తో ఎంతోమంది కుటుంబాలలో వెలుగులు నిండాయని అన్నారు . .తెలంగాణలోనూ ములుగు జిల్లా లోనూ టీడీపీ పార్టీ బలోపేతం ఐతే ములుగు ప్రజలకు మంచి రోజులు వస్తాయని దేవా నాయక్ అభిప్రాయం వ్యక్తం చేశారు ములుగు జిల్లాలో టీడీపీ జెండా ఏగుర వేయడమే ధ్యేయం గా పని చేస్తానని దేశ భవిషత్తు చంద్ర బాబునాయుడు చేతుల్లోనే ఉందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని బలోపేతం చేసి టీడీపీ కి పూర్వ వైభవం తీసుక రావాలని దేవా నాయక్ ములుగు నియోజక వర్గం ప్రజలను కోరారు.
………………………………………………