ఆకేరున్యూస్, హైదరాబాద్: లగచర్ల దాడి ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 17 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కొడంగల్ పోలిస్టేషన్ నుంచి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరందరిని సాయంత్రం వరకు రిమాండ్ చేసే అవకాశం ఉండగా.. మరికొందరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
………………………………………