* విద్యుత్ పనుల పై సమీక్షా
* ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
ఆకేరు న్యూస్, ములుగు: 2026 జనవరి 28 నుండి 31 వరకు జరిగే మహా కుంభమేళాల తలపించే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందజేయాలని ఎంపీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి ఆదేశించారు. బుధవారం మేడారం విద్యుత్ పనులపై ములుగు జిల్లాలోని ములుగు , ఏటునాగారం డివిజన్ పరిధిలోని డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ డిజైన్లు ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు , సబ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించినారు. ఈ సమీక్షా సమావేశం లో ఆయన మాట్లాడుతూ మహా జాతరను పురస్కరించుకొని కావలసిన సామాగ్రి, మ్యాన్ పవర్ అన్నిటిని సమకూర్చుకొని అందరు ఈ మహా జాతరను ఒక అదృష్టంగా భావించి, మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అదే విధంగా మేడారం మహా జాతర పనులను పస్రా సబ్ స్టేషన్ నుండి మొదలుకొని నార్లపూర్, కొత్తూరు, తాడ్వాయి, మేడారం న్యూ సబ్ స్టేషన్ ,మెయిన్ టెంపుల్ ఏరియా, ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, చిలకలగుట్ట ఏరియా, జంపన్న వాగు పరిసరాలను పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చినారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆపరేషన్ శ్రీ టి మధుసూదన్ డైరెక్టర్, వి మోహన్ రావు డైరెక్టర్ ప్రొడక్ట్స్, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ రాజు చౌహాన్ గారు, ములుగు ఇంచార్జ్ ఎస్సీ శ్రీ మల్చూరు నాయక్, MRT కన్స్ట్రక్షన్ , సివిల్ , ఆపరేషన్ అధికారులు పాల్గొన్నారు .

……………………………………………………………
