* పోలీసులు అలర్ట్
ఆకేరు న్యూస్ డెస్క్ : బాంబు బెదిరింపులు దేశ రాజధాని ఢిల్లీ లో మరోసారి కలకలం రేపాయి. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఢిల్లీ హైకోర్టులో బాంబులు పెట్టినట్లు శుక్రవారం ఉదయం ఈమెయిల్ వచ్చింది. కోర్టు ప్రాంగణంలో మూడు బాంబులను అమర్చామని, మరికాసేపట్లో అవి పేలుతాయంటూ బెదిరించారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు ఖాళీ చేయాలని సూచించగా, పేలుడు పదార్థాలు ఎక్కడెక్కడ పెట్టారన్నది పేర్కొనలేదు. ఈ బెదిరింపు మెయిల్‌తో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టులోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందిని బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
……………………………………………..
