* దళ కమాండర్ మృతి
ఆకేరున్యూస్: జార్ఖండ్‌్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు దళ కమాండర్ మృతిచెందారు. హైదర్‌నగర్-మహమ్మద్‌గంజ్ పోలీస్ స్టేషన్ల మధ్య ఉన్న సీతాచువాన్ అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపడుతుండగా జరిగిన ఎదురు కాల్పుల్లో నిషేధిత సీపీఐ మావోయిస్టు అగ్ర కమాండర్ తులసి భూనియన్ మృతిచెందినట్లు అధికారులు వెల్లడిరచారు. ఈ ఎన్కౌంటర్లో నితేశ్ యాదవ్ అనే మావోయిస్టు గాయపడ్డారని, అతనిపై రూ.15 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో సెల్ఫ్ లోడిరగ్ రైఫిల్‌తోపాటు భారీగా ఆయుధాలు స్వాధినం చేసుకున్నామని వెల్లడిరచారు.
……………………………………..
