
* ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆకేరున్యూస్, ఛత్తీస్గఢ్: కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. గత వారం జరిగిన రెండు వేర్వేరు ఎదురు కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతిచెందగా.. తాజాగా అక్కడ మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లాలో భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ – బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి నక్సలైట్ల మృతదేహాలతోపాటు తుపాకీలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
……………………….