* కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
* రూ.24,276 కోట్ల విలువైన పనులకు గ్రీన్‌సిగ్నల్
ఆకేరున్యూస్, అమరావతి : ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా రూ. 11 వేల కోట్లు రుణానికి, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా రూ. 5 వేల కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనకు, హంద్రీనీవా సుజల స్రవంతి రెండోదశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్‌కు అనుమతికి నిర్ణయం తీసుకుంది. వర్షకాలంలో భారీ వర్షాలకు నష్టపోయిన 10 జిల్లాలోని వరద ప్రభావిత బాధితులకు రుణాల రీ షెడ్యూల్‌పై, రైతులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయించే ప్రతిపాదనపై చర్చ కొనసాగింది. ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలకు ఉచితంగా ఇచ్చే అంశం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలపై చర్చ జరిగింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసిన కేబినెట్ వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం తెలిపింది. మంగళగిరి ఎయిమ్స్‌కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయించడానికి నిర్ణయం తీసుకుంది.
……………………………………..