
* మంత్రి పదవి ఇవ్వాలని యాదవుల డిమాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలని యాదవులు వినూత్నంగా నిరసన తెలిపారు. గాంధీభవన్ (Gandhibhavan) లోకి గొర్రెలతో విచ్చేశారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్ వద్ద ఆందోళన నిర్వహించారు. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వడంతో పాటు, తమ గొర్రెలు, మేకలకు వైద్య సదుపాయం, బీమా సదుపాయం కల్పించాలని కోరారు. మొత్తం 30 గొర్రెలు, ఐదు మేకలతో యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు గాంధీభవన్‌కు చేరుకున్నారు. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి కావాలని, గొర్రెలకు, మేకలకు వైద్య, బీమా సౌకర్యాలు కల్పించాలి అంటూ నినాదాలు చేశారు.
………………………………………….